Monday, 7 January 2013

అక్భర్ ....,అబంధాలు వద్దు ...,

నోరు మంచిది ఐతే ఊరు మంచిది అన్న సమేత గుర్తుకు వస్తోంది ఎం ఐ ఎం శాసన సభ్యడు అక్బరుద్దీన్ కధనం చూస్తే .నోరు పారేసుసుకోవడమేఅక్బరుద్దీన్ ఒవైసీ కి అలవాటైనట్లు అనిపిస్తోంది .. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ....,దీని ఫై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తు తుంటే ...,అక్బరుద్దీన్ మల్లీ నోరుపరేసుకొని తప్పుమీద తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది .ఈరోజు విదేశాల నుంచి వచ్చి ....,జర్నలిస్ట్ లు కావాలనే ..,తన మాటలను  వక్రీకరించారని అనడం....,తన నోరు దురుసు తనానికి నిదర్శనం ...  పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకాడానికి నాలుగు రోజుల సమయం కావాలని,తరువాత ఎప్పుడైనా సరే విచారణకు హాజరవుతానని తమ లాయర్ ద్వారా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ పోలీసులకు సమాచారం అందజేసి ,హైకోర్ట్ లో స్క్వాష్ పిటీషన్ వేసి ...,పైన  పేర్కొన్న విధంగా జర్నలిస్ట్ ల ఫై నోరు పారేసుకోవడం శోచనీయం .మీడియా లో సంచలనాల కోసమే నోరు పారేసుకొని ...,అది కాస్త వికటిస్తే అది మీడియా సృష్టి అనడం ఎంతవరకు సబబు ఎం ఎల్ ఏ గారు .  

అక్బరుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని, అందువల్ల నాలుగు రోజుల గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది పోలీసులను కోరుకుంటున్న తరుణం లో మళ్ళీ నోరు పారేసుకొని తప్పు మీద తప్పు చేస్తున్నడు.. 

హిందూ దేవతలపైనా, హిందుత్వంపైనా విద్వేషపూరితమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసుల్లో ఇరుక్కున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఈనెల 7న నిర్మల్ పీఎస్‌లో, 8న నిజామాబాద్ పీఎస్‌లో, 10న ఓయూ పోలీస్‌స్టేష్‌న్‌లో హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ మీడియా ద్వారా చెప్పడం ఎలా వక్రీకరించడం అంటారు ఎం ఎల్ ఎ గారు .....,చెప్పండి ప్లీజ్ ....,

No comments:

Post a Comment