నవ్వుతూ అనడం, ఏడుస్తూ అనుభవించడం
నవ్వుతూ అనడం, ఏడుస్తూ అనుభవించడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇలాంటి దుస్థితిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం గతంలో తీసుకున్న విభిజించే చర్య ఇప్పుడు రాష్ట్రంలో మరణశాసనంలా మారింది. అధికారం, తాత్కాలిక ప్రయోజనాల కోసం కొత్త సమస్యలు సృష్టించి, తిరిగి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నాడుతున్న అవే సమస్యను పరిష్కరించలేక కాంగ్రెస్ నాయకత్వం చేతులారా తన పార్టీని తానే బలహీనపరు చుకుంటోంది. సొంత సమస్యలను పరిష్కరించుకునే బదులు, కొత్త సమస్యలు సృష్టించడం ద్వారా కొద్దికాలం ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దశాబ్దాల నుంచి అనుసరిస్తోన్న వ్యూహం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బెడిసికొడుతోంది. ప్రత్యర్ధులను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా కొత్త సమస్యలు సృష్టిస్తోన్న తమ పార్టీ నాయకత్వానికి.. చివరకు అవే సమస్యలు గుదిబండలా మారి, అసలు ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి తలెత్తిందని, ఇదంతా త మ నాయకత్వం స్వయంకృతమేనన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.
గతంలో పంజాబ్‌లో భింద్రేన్‌వాలా వ్యవహారాన్ని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉటంకిస్తున్నారు. పంజాబ్‌లో అకాళీదల్‌ను బలహీన పరిచేందుకు భింద్రేన్‌వాలాను ప్రోత్సహించిన నాయకత్వం చివరకు అదే అంశంలో ఆయనపై యుద్ధం చేయడం ద్వారా యావత్ సిక్కు సమాజానికి దూరమవడంతో పాటు, అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ఇందిరనూ పోగొట్టుకోవడానికి అప్పటి విభజన విధానం కారణమయిందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమస్య కూడా తమ పార్టీకి మరణశాసనం కానుందంటున్నారు. నాడు వైఎస్ మర్చిపోయిన తెలంగాణ వాదాన్ని అధికారంకోసం తెరపైకి తీసుకురావడం ఇప్పుడు పార్టీని అయోమయంలో పడవేసిందని వివరిస్తున్నారు. తెలంగాణపై తీసుకునే నిర్ణయం పార్టీ మెడపై కత్తిలా వేళ్లాడుతోందని, ఒక తాత్కాలిక లాభం కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నది తమ నాయకత్వానికి తెలంగాణ రూపంలో మరొకసారి అనుభవపూర్వకంగా తెలిసివస్తోందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కేవలం చంద్రబాబునాయుడును గద్దె దింపేందుకు నాడు వైఎస్ చేసిన విభజన ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తున్నాయని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పి, ఎదురులేకుండా ఉన్న బాబును గద్దె దించి, తాము అధికారంలోకి రావాలంటే సమసిపోయిన తెలంగాణ సమస్యను తెరమీదకు తీసుకురావడమే ఏకైక మార్గంగా భావించిన వైఎస్ తెలంగాణకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి, తెలంగాణ కావాలన్న డిమాండును పునరుద్ధరింపచేశారు. దానితోపాటు చిన్నారెడ్డి సారధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటుచేయించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అంటే 70వ దశకంలోనే సద్దుమణిగిన తెలంగాణ సమస్యను వైఎస్ తిరిగి తిరగదోడినట్లు స్పష్టమవుతోంది. నాడు తమ నాయకత్వం కూడా ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న తపనతో తెలంగాణవాదాన్ని ప్రోత్సహించి ఇప్పుడు చిక్కుల్లో పడిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
అప్పట్లోనే వైఎస్ ప్రయత్నాన్ని నివారించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని స్పష్టం చేస్తున్నారు. నరేంద్రమోడీ వంటి వారిని మినహాయిస్తే.. వరసగారెండుసార్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకయినా ప్రజావ్యతిరేకత సహజమని, అయితే తమ పార్టీ రానున్న కాలంలో ఎన్ని సీట్లు గె లుస్తుందో కూడా తెలియనంత ఆందోళనకర పరిస్థితి తలెత్తడం పార్టీ చరిత్రలో ఇదే తొలిసారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గులాంనబీ ఆజాద్ సీమాంధ్ర నేతలు తనను కలిసిన సందర్భంలో మీ ప్రాంతంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది? అసలు మీరు మళ్లీ గెలుస్తారా? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధులను దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా కొత్త సమస్యలు సృష్టించే ఇందిరాగాంధీ కాలం నాటి విధానం ఎప్పుడో చెల్లిపోయిందని నేతలు విశ్లేషిస్తున్నారు. గతంలో భిం ద్రేన్‌వాలా, బాల్‌థాక్రే, మమతా బెనర్జీ వంటి వారిని కూడా తమ నాయకత్వమే రాజకీయ అవసరాలు, ప్రత్యర్ధి పార్టీని ఎదుర్కొనేందుకు ప్రోత్సహించిందని చెబుతున్నారు. అయితే వారి ముగ్గురి మనస్తత్వాలు, దేశం పట్ల నిబద్ధత, చిత్తశుద్ధిలో తేడాలు ఉన్నప్పటికీ పంజాబ్‌లో కాంగ్రెస్ పతనాన్ని ఆపరేషన్ బ్లూస్టార్ శాసించిందని గుర్తు చేశారు.
అదేవిధంగా మహారాష్టల్రో కార్మిక నాయకుడిగా ఉన్న థాక్రేను తన అవసరాల కోసం ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీని, చివరకు అదే థాక్రే దెబ్బతీశారని గుర్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను ఎదుర్కొనేందుకు మమతాబెనర్జీని ప్రోత్సహించిందని, చివరకు ఆమె కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చారంటున్నారు. మహారాష్టల్రో తనపై తిరుగుబాటు చేసిన శరద్‌పవార్‌నే తిరిగి సర్కారులోకి తీసుకోవలసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. పార్టీ-ప్రభుత్వంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం బదులు, కొత్త సమస్యలు సృష్టించడం, ప్రత్యర్థి పార్టీలను అణచివేసేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొత్త సమస్యను తెరమీదకు తీసుకురావడం వల్ల చివరకు అవే సమస్యలు తమ పార్టీకి శాపంగా మారిందని, ఈ పరిణామాలు చివరకు పార్టీ ఉనికికే సవాలుగా మారే పరిస్థితి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్యను సృష్టించిన తమ నాయకత్వం, చివరకు దాని పరిష్కారం ఏమిటో తెలియక తానే గందరగోళంలో పడిందని సీనియర్లు చెబుతున్నారు.
చంద్రబాబును ఎదుర్కోలేక, ఆయనకు సమస్యలు సృష్టించేందుకు వైఎస్సే తెలంగాణ ఎఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని వి.హన్మంతరావు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబును గద్దె దించేందుకు ఆనందం కలిగించిన ఆ చర్య ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మరణశాసనంగా మారనుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో? ఒక ప్రాంతానికి అనుకూల నిర్ణయం తీసుకుంటే మరొక ప్రాంతంలో పార్టీ ఉనికి ఏమవుతుంది? అన్న ఆత్మహత్యాసదృశ మీమాంసలో పడింది. తెలంగాణలో పార్టీ బలపడేందుకు, టీడీపీని ఓడించేందుకు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో చోటు కల్పించిన తమ పార్టీని, ఇప్పుడు అదే టీఆర్‌ఎస్ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందని సీనియర్లు వివరించారు. కేవలం టీడీపీని ఓడిం చేందుకు టీఆర్‌ఎస్‌ను ప్రోత్సహించిన తమ నాయకత్వం, మళ్లీ ఆ పార్టీకి దూరమయి, ఇప్పుడు అదే పార్టీతో రహస్య మంతనాలు సాగిస్తోందని విశ్లేషిస్తున్నారు. తాజాగా మజ్లిస్‌పై యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ ఆ పార్టీని నెత్తిన పెట్టుకుని సరిదిద్దుకోలేని తప్పుచేసిందంటున్నారు. కాంగ్రెస్‌కు దూరమయి, పార్టీకి ముస్లిం ఓట్లకు గండికొట్టేలా మారిందన్నారు. అవసరం ఉన్నప్పుడు నెత్తినెక్కించుకోవడం, అవ సరం లేకపోతే కిందికు విసిరేయడం వల్ల పార్టీకి ఒక నిర్దిష్ట సిద్ధాంతం లేదన్న సంకతాలు ప్రజల్లోకి వెళ్లాయని చెబుతున్నారు.
I like it, and will back for reply.
ReplyDeleteLoad Junction, load matching Services, Find Truck Loads, Find Freight and Trucks
thank you sir
ReplyDeleteHey there apjournalistmitrulaku information or the article which u had posted was simply superb and to say one thing that this was one of the best information which I had seen so far, thanks for the information #BGLAMHAIRSTUDIO
ReplyDelete