మన సత్తా చాటుదాం
ఆం ధ్ర రాష్ట్ర యావత్ జర్నలిస్ట్ మిత్రులకు ....,వారి కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో.....,మిత్రులారా మొన్న జరిగిన ఢిల్లీ ఘటన తలుచుకుంటే మనసు అతలాకుతలం గా ఉంటోంది .ఏ పేపర్ చూసినా ,ఏ న్యూస్ చానెల్ చూసినా ఢిల్లీ ఘటన ను గుర్తు చేస్తూనే ఉన్నాయి .ఏదైనా విపత్తు జరిగినపుడు దేశంలోని సినీ ప్రముఖులు ,రాజకీయ నాయకులూ ,సంఘ సంస్కర్తలు వారికి తోచిన రీతిలో స్పందిస్తారు .ఢిల్లీ ఘటన ఫై కూడా స్పందించారు ...,సంతోషం .కాని మిత్రులారా ఇప్పుడు ఎక్కువగా స్పందిచాలసినది మనం ....,అంటే జర్నలిస్ట్ లం ...,మిత్రులారా మనం అందరం కలసి ఇకమీదట స్త్రీల ఫై గాని ,యువతుల ఫై గాని ,బాలిక ల ఫై గాని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి మనం ఎలాంటి విదానాన్ని అనుసరించాలో చర్చించు కుందాము ...,దీనికి మనం ఏమి చేయాలో ....,దయతో సూచించండి .....,ఎలా ఆచరణ సాధ్యమో మీ పదు నైన ఆలోచనలతో రెండు మాటలు పోస్ట్ చేయండి ....,దీనిని ఒక ఉద్యమంగా నడపడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ కి నాయకత్వాన్ని కట్ట బెట్టి జర్నలిస్ట్ అనుకుంటే ఏమైనా చేసి జాతిని మేల్కొల్పు తాడని నిరూ పిందాం .
No comments:
Post a Comment