Friday, 25 January 2013




నవ్వుతూ అనడం, ఏడుస్తూ అనుభవించడం



నవ్వుతూ అనడం, ఏడుస్తూ అనుభవించడం ఎందుకు? కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా ఇలాంటి దుస్థితిలోనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తన అవసరాల కోసం గతంలో తీసుకున్న విభిజించే చర్య ఇప్పుడు రాష్ట్రంలో మరణశాసనంలా మారింది. అధికారం, తాత్కాలిక ప్రయోజనాల కోసం కొత్త సమస్యలు సృష్టించి, తిరిగి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నాడుతున్న అవే సమస్యను పరిష్కరించలేక కాంగ్రెస్‌ నాయకత్వం చేతులారా తన పార్టీని తానే బలహీనపరు చుకుంటోంది. సొంత సమస్యలను పరిష్కరించుకునే బదులు, కొత్త సమస్యలు సృష్టించడం ద్వారా కొద్దికాలం ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం దశాబ్దాల నుంచి అనుసరిస్తోన్న వ్యూహం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బెడిసికొడుతోంది. ప్రత్యర్ధులను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా కొత్త సమస్యలు సృష్టిస్తోన్న తమ పార్టీ నాయకత్వానికి.. చివరకు అవే సమస్యలు గుదిబండలా మారి, అసలు ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి తలెత్తిందని, ఇదంతా త మ నాయకత్వం స్వయంకృతమేనన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.

గతంలో పంజాబ్‌లో భింద్రేన్‌వాలా వ్యవహారాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఉటంకిస్తున్నారు. పంజాబ్‌లో అకాళీదల్‌ను బలహీన పరిచేందుకు భింద్రేన్‌వాలాను ప్రోత్సహించిన నాయకత్వం చివరకు అదే అంశంలో ఆయనపై యుద్ధం చేయడం ద్వారా యావత్‌ సిక్కు సమాజానికి దూరమవడంతో పాటు, అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ఇందిరనూ పోగొట్టుకోవడానికి అప్పటి విభజన విధానం కారణమయిందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమస్య కూడా తమ పార్టీకి మరణశాసనం కానుందంటున్నారు. నాడు వైఎస్‌ మర్చిపోయిన తెలంగాణ వాదాన్ని అధికారంకోసం తెరపైకి తీసుకురావడం ఇప్పుడు పార్టీని అయోమయంలో పడవేసిందని వివరిస్తున్నారు. తెలంగాణపై తీసుకునే నిర్ణయం పార్టీ మెడపై కత్తిలా వేళ్లాడుతోందని, ఒక తాత్కాలిక లాభం కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నది తమ నాయకత్వానికి తెలంగాణ రూపంలో మరొకసారి అనుభవపూర్వకంగా తెలిసివస్తోందని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

కేవలం చంద్రబాబునాయుడును గద్దె దింపేందుకు నాడు వైఎస్‌ చేసిన విభజన ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తున్నాయని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పి, ఎదురులేకుండా ఉన్న బాబును గద్దె దించి, తాము అధికారంలోకి రావాలంటే సమసిపోయిన తెలంగాణ సమస్యను తెరమీదకు తీసుకురావడమే ఏకైక మార్గంగా భావించిన వైఎస్‌ తెలంగాణకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి, తెలంగాణ కావాలన్న డిమాండును పునరుద్ధరింపచేశారు. దానితోపాటు చిన్నారెడ్డి సారధ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటుచేయించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అంటే 70వ దశకంలోనే సద్దుమణిగిన తెలంగాణ సమస్యను వైఎస్‌ తిరిగి తిరగదోడినట్లు స్పష్టమవుతోంది. నాడు తమ నాయకత్వం కూడా ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న తపనతో తెలంగాణవాదాన్ని ప్రోత్సహించి ఇప్పుడు చిక్కుల్లో పడిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అప్పట్లోనే వైఎస్‌ ప్రయత్నాన్ని నివారించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని స్పష్టం చేస్తున్నారు. నరేంద్రమోడీ వంటి వారిని మినహాయిస్తే.. వరసగారెండుసార్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకయినా ప్రజావ్యతిరేకత సహజమని, అయితే తమ పార్టీ రానున్న కాలంలో ఎన్ని సీట్లు గె లుస్తుందో కూడా తెలియనంత ఆందోళనకర పరిస్థితి తలెత్తడం పార్టీ చరిత్రలో ఇదే తొలిసారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గులాంనబీ ఆజాద్‌ సీమాంధ్ర నేతలు తనను కలిసిన సందర్భంలో మీ ప్రాంతంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది? అసలు మీరు మళ్లీ గెలుస్తారా? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధులను దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా కొత్త సమస్యలు సృష్టించే ఇందిరాగాంధీ కాలం నాటి విధానం ఎప్పుడో చెల్లిపోయిందని నేతలు విశ్లేషిస్తున్నారు. గతంలో భిం ద్రేన్‌వాలా, బాల్‌థాక్రే, మమతా బెనర్జీ వంటి వారిని కూడా తమ నాయకత్వమే రాజకీయ అవసరాలు, ప్రత్యర్ధి పార్టీని ఎదుర్కొనేందుకు ప్రోత్సహించిందని చెబుతున్నారు. అయితే వారి ముగ్గురి మనస్తత్వాలు, దేశం పట్ల నిబద్ధత, చిత్తశుద్ధిలో తేడాలు ఉన్నప్పటికీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ పతనాన్ని ఆపరేషన్‌ బ్లూస్టార్‌ శాసించిందని గుర్తు చేశారు.

అదేవిధంగా మహారాష్టల్రో కార్మిక నాయకుడిగా ఉన్న థాక్రేను తన అవసరాల కోసం ప్రోత్సహించిన కాంగ్రెస్‌ పార్టీని, చివరకు అదే థాక్రే దెబ్బతీశారని గుర్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను ఎదుర్కొనేందుకు మమతాబెనర్జీని ప్రోత్సహించిందని, చివరకు ఆమె కాంగ్రెస్‌కు ఝలక్‌ ఇచ్చారంటున్నారు. మహారాష్టల్రో తనపై తిరుగుబాటు చేసిన శరద్‌పవార్‌నే తిరిగి సర్కారులోకి తీసుకోవలసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. పార్టీ-ప్రభుత్వంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం బదులు, కొత్త సమస్యలు సృష్టించడం, ప్రత్యర్థి పార్టీలను అణచివేసేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొత్త సమస్యను తెరమీదకు తీసుకురావడం వల్ల చివరకు అవే సమస్యలు తమ పార్టీకి శాపంగా మారిందని, ఈ పరిణామాలు చివరకు పార్టీ ఉనికికే సవాలుగా మారే పరిస్థితి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్యను సృష్టించిన తమ నాయకత్వం, చివరకు దాని పరిష్కారం ఏమిటో తెలియక తానే గందరగోళంలో పడిందని సీనియర్లు చెబుతున్నారు.

చంద్రబాబును ఎదుర్కోలేక, ఆయనకు సమస్యలు సృష్టించేందుకు వైఎస్సే తెలంగాణ ఎఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని వి.హన్మంతరావు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబును గద్దె దించేందుకు ఆనందం కలిగించిన ఆ చర్య ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మరణశాసనంగా మారనుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో? ఒక ప్రాంతానికి అనుకూల నిర్ణయం తీసుకుంటే మరొక ప్రాంతంలో పార్టీ ఉనికి ఏమవుతుంది? అన్న ఆత్మహత్యాసదృశ మీమాంసలో పడింది. తెలంగాణలో పార్టీ బలపడేందుకు, టీడీపీని ఓడించేందుకు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో చోటు కల్పించిన తమ పార్టీని, ఇప్పుడు అదే టీఆర్‌ఎస్‌ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందని సీనియర్లు వివరించారు. కేవలం టీడీపీని ఓడిం చేందుకు టీఆర్‌ఎస్‌ను ప్రోత్సహించిన తమ నాయకత్వం, మళ్లీ ఆ పార్టీకి దూరమయి, ఇప్పుడు అదే పార్టీతో రహస్య మంతనాలు సాగిస్తోందని విశ్లేషిస్తున్నారు. తాజాగా మజ్లిస్‌పై యుద్ధం చేస్తున్న కాంగ్రెస్‌ ఆ పార్టీని నెత్తిన పెట్టుకుని సరిదిద్దుకోలేని తప్పుచేసిందంటున్నారు. కాంగ్రెస్‌కు దూరమయి, పార్టీకి ముస్లిం ఓట్లకు గండికొట్టేలా మారిందన్నారు. అవసరం ఉన్నప్పుడు నెత్తినెక్కించుకోవడం, అవ సరం లేకపోతే కిందికు విసిరేయడం వల్ల పార్టీకి ఒక నిర్దిష్ట సిద్ధాంతం లేదన్న సంకతాలు ప్రజల్లోకి వెళ్లాయని చెబుతున్నారు.

Monday, 7 January 2013

అక్భర్ ....,అబంధాలు వద్దు ...,

నోరు మంచిది ఐతే ఊరు మంచిది అన్న సమేత గుర్తుకు వస్తోంది ఎం ఐ ఎం శాసన సభ్యడు అక్బరుద్దీన్ కధనం చూస్తే .నోరు పారేసుసుకోవడమేఅక్బరుద్దీన్ ఒవైసీ కి అలవాటైనట్లు అనిపిస్తోంది .. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ....,దీని ఫై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తు తుంటే ...,అక్బరుద్దీన్ మల్లీ నోరుపరేసుకొని తప్పుమీద తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది .ఈరోజు విదేశాల నుంచి వచ్చి ....,జర్నలిస్ట్ లు కావాలనే ..,తన మాటలను  వక్రీకరించారని అనడం....,తన నోరు దురుసు తనానికి నిదర్శనం ...  పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకాడానికి నాలుగు రోజుల సమయం కావాలని,తరువాత ఎప్పుడైనా సరే విచారణకు హాజరవుతానని తమ లాయర్ ద్వారా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ పోలీసులకు సమాచారం అందజేసి ,హైకోర్ట్ లో స్క్వాష్ పిటీషన్ వేసి ...,పైన  పేర్కొన్న విధంగా జర్నలిస్ట్ ల ఫై నోరు పారేసుకోవడం శోచనీయం .మీడియా లో సంచలనాల కోసమే నోరు పారేసుకొని ...,అది కాస్త వికటిస్తే అది మీడియా సృష్టి అనడం ఎంతవరకు సబబు ఎం ఎల్ ఏ గారు .  

అక్బరుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నారని, అందువల్ల నాలుగు రోజుల గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది పోలీసులను కోరుకుంటున్న తరుణం లో మళ్ళీ నోరు పారేసుకొని తప్పు మీద తప్పు చేస్తున్నడు.. 

హిందూ దేవతలపైనా, హిందుత్వంపైనా విద్వేషపూరితమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసుల్లో ఇరుక్కున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఈనెల 7న నిర్మల్ పీఎస్‌లో, 8న నిజామాబాద్ పీఎస్‌లో, 10న ఓయూ పోలీస్‌స్టేష్‌న్‌లో హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ మీడియా ద్వారా చెప్పడం ఎలా వక్రీకరించడం అంటారు ఎం ఎల్ ఎ గారు .....,చెప్పండి ప్లీజ్ ....,

Thursday, 3 January 2013



పత్తా లేని పత్రీ .....,ఖభాడ్దర్ 



ద్యానం ముసుగు లో ఇన్నిరోజులు మహిళల పట్ల వికారపు చేష్టలు చేసిన పత్రీ ఖభాడ్దర్ .నీకు ప్రచారం చేస్తే జర్నలిస్ట్ గొప్పవాళ్ళని పొగిడిన నువ్వు ...,తప్పులు చేస్తున్నావ్ ...,ఇది నీ వయస్సుకు తగిన పని కాదు అని చెప్పిన జర్నలిస్ట్ మిత్రులను నీ అనుచర ఘనం తో దాడి చేయెంచి  కోరువుతో తలగోకున్నట్లు చేసుకున్నావ్ .పత్రీ నువ్వు ఎక్కడ దాకున్నా ..., పోలీసు లతో పాటు మేము (యావత్ జర్నలిస్ట్ మిత్రులు)వదలం .పత్రీ నీవు చేస్తున్న ద్యానం అన్నది జనానికి కొద్దిగా రిలీఫ్ ఉండటం వల్ల నమ్మారు .కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ..., నీ పిరమిడ్ ద్యానం ముసుగులో మహిళల  పట్ల వికారపు చేష్టలు చేస్తూ పెద్ద తప్పు చేసావు ...,ఆ వికృత చేష్టల గురించి ప్రజలకు తెలియజయడానికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులఫై దాడి చేయించి ......,నీకు తెలియకనే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావ్ ....,పత్రీ  నీకు పతనం మొదలైంది ...,ద్యాస శ్వాస మీద కాదు ....,నీకు శ్వాస ఆడకుండా చేయడానికి ఇటు జర్నలిస్ట్ లు ...,అటు పోలీసులు ఇక వదిలే ప్రసక్తే లేదు కాసుకో ....,

Tuesday, 1 January 2013

మన సత్తా చాటుదాం 


ఆం ధ్ర రాష్ట్ర యావత్ జర్నలిస్ట్ మిత్రులకు ....,వారి కుటుంబ సభ్యులకు  నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలతో.....,మిత్రులారా మొన్న జరిగిన ఢిల్లీ ఘటన తలుచుకుంటే మనసు అతలాకుతలం గా ఉంటోంది .ఏ పేపర్ చూసినా ,ఏ న్యూస్ చానెల్ చూసినా ఢిల్లీ ఘటన ను గుర్తు చేస్తూనే ఉన్నాయి .ఏదైనా విపత్తు జరిగినపుడు దేశంలోని సినీ ప్రముఖులు ,రాజకీయ నాయకులూ ,సంఘ సంస్కర్తలు వారికి తోచిన రీతిలో స్పందిస్తారు .ఢిల్లీ ఘటన ఫై కూడా స్పందించారు ...,సంతోషం .కాని మిత్రులారా ఇప్పుడు ఎక్కువగా స్పందిచాలసినది మనం ....,అంటే జర్నలిస్ట్ లం ...,మిత్రులారా మనం అందరం కలసి ఇకమీదట స్త్రీల ఫై గాని ,యువతుల ఫై గాని ,బాలిక ల ఫై గాని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి మనం ఎలాంటి విదానాన్ని అనుసరించాలో చర్చించు కుందాము ...,దీనికి మనం ఏమి చేయాలో ....,దయతో సూచించండి .....,ఎలా ఆచరణ సాధ్యమో మీ పదు నైన ఆలోచనలతో రెండు మాటలు పోస్ట్ చేయండి ....,దీనిని ఒక ఉద్యమంగా నడపడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ కి నాయకత్వాన్ని కట్ట బెట్టి జర్నలిస్ట్ అనుకుంటే ఏమైనా చేసి జాతిని మేల్కొల్పు తాడని నిరూ పిందాం .